కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాపించకుండా ఉండేందుకు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వాలు చెప్పే జాగ్రత్తలు, ప్రజలకు ఇచ్చే సంక్షేమ పధకాలు ప్రజలకు చేరవేసేది, ఇటు ప్రజా సమస్యలు ప్రభుత్వానికి చేరవేసేది ఒక్క జర్నలిస్ట్ మాత్రమే...
అలాంటి జర్నలిస్టులను మరిచిపోవడం భావ్యం కాదు. జీతాలు లేకుండా, లాభాపేక్ష చూడకుండా, సమాజం కోసం అహర్నిశలు పని చేసేది, నిరంతరం పాటు పడేది కేవలం జర్నలిస్ట్ మాత్రమే...
కేంద్రం మరియూ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సమయంలో అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమ పధకాలు, నగదు బదిలీ అందుబాటులోకి తెచ్చారు, కానీ నిరంతరం జనజాగృతిని జాగృత పరిచే, జనంకోసం పని చేసే జర్నలిస్టుని మాత్రం మరిచారు
లాక్ డౌన్ సమయంలో పని చేసే ప్రతీ జర్నలిస్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ వేతనం / ప్రత్యేక సంక్షేమ పధకాలు వెంటనే అమలు చేయాలని నేను కోరుతున్నాను...
* కొందరు విలేకరులు సొంత గ్రామాలను విడిసి మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో నివాసం ఉండి ఇంటి అద్దె కిరాయలు, కుటుంబ పోషణ వార్తల సేకరణకు అదనపు కర్చులతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.*
* విధినిర్వహణలో అనారోగ్యాలు, ప్రమాదాలకు గురై మెరుగైన వైద్యనికీ కూడా నోచుకోలేక పోతున్నారు. అకారణంగా మృతి చెందిన జర్నలిస్టుల ఎన్నో కుటుంబాలు కూడా వున్నాయి.*
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు, రైతులకు, చిరువ్యపరులకు, వృత్తి నైపుణ్య దారులకు ఇలా ఎంతోమందికి సబ్సిడీ రుణాలు ఇచ్చి అదుకుంటున్న ఏ ఆర్థిక అధరాలు లేని విలేకర్ల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలోషించక పోవడం గమనార్హం*
జర్నలిస్టుల బాధలు ప్రభుత్వానికి తెలిసేవరకు, జర్నలిస్టులందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక గౌరవ వేతనం, సంక్షేమ పథకాలు ప్రకటించేవరకు షేర్ చేయండి.